Thursday, March 12, 2026

ఉచిత ఆక్యుపంచర్ మరియు న్యాచురోపతి శిబిరం

నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు కట్ట పైన “సృష్టి ఆక్యుపంచర్ మరియు న్యాచురోపతి” ఏర్పాటు చేసిన ఆక్యుపంచర్ మరియు న్యాచురోపతి శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మాజీమంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పట్లోల్ల సబితా ఇంద్రా రెడ్డి ప్రారంభించడం జరిగింది.వేముల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో దాదాపు 15 మంది హీలర్లు హాజరై ఎంతో మంది రోగులకు చికిత్స అందించారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తను కూడా ఈ చికిత్స తీసుకున్నానని ఈ చికిత్స ఎంతో మేలైనదని ఎటువంటి మందులు లేకుండా తగ్గించుకోవడం ఎంతో సుఖమని ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. క్యాంపుని నిర్వహిస్తున్న హీలర్లను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సిధ్ధాల లావణ్య బీరప్ప,సిధ్ధాల పద్మ అంజయ్య,ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, నాయకులు దీప్ లాల్ చౌహాన్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంటేరు నరసింహా రెడ్డి,మీర్ పేట్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సునీత బాలరాజు, విజయలక్ష్మి,నగరపాలక సంస్థ కమీషనర్ ఆర్. జ్ఞానేశ్వర్, నిర్వాహకులు వేముల శ్రీధర్, జ్యోతి మరియు సియాన్ అధినేత సుధాకర్, ఉపాధ్యాయురాలు జ్యోతి పాల్గొన్నారు.
అర్కల కామేష్ రెడ్డి మీర్ పేట్ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News