Thursday, March 12, 2026

కబ్జా చేసిన భూమిని తిరిగి ఇవ్వాలి

నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి: తండ్రి నుంచి వచ్చిన భూమిని కబ్జా చేసిన వ్యక్తుల నుండి తిరిగి తనకు అప్పగించాలని ఓ దళిత మహిళ కలెక్టర్ ను వినతిపత్రం ద్వారా వేడుకుంది.వివరాలకు వెళితే… సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కిష్టాపురం గ్రామానికి చెందిన మద్దెల సీతకు తన తండ్రి దోమల అచ్చయ్య 30 ఏళ్ల క్రితం చనిపోగా తదనంతరం తనపై వారసత్వంగా ఎకరం 18 కుంటలు భూమిని పట్టా చేయడం జరిగిందన్నారు. తన తండ్రి బ్రతికుండగా రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ పట్టా ద్వారా తనకు భూమిని అప్పగించినప్పటికీ గ్రామానికి చెందిన అగ్రకుల కుటుంబం తన తండ్రిని బెదిరింపులకు పాల్పడి సేద్యంకు అనుకూలంగా ఉన్న భూమిని కబ్జా చేసి వేరే భూమి తన తండ్రికి అప్పగించారని అట్టి భూమిని తనకు తిరిగి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశానన్నారు.దళితులపై ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడిన వారి పైన చర్యలు తీసుకొని తమ న్యాయం చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News