Thursday, March 12, 2026

23 ఎళ్ళ తర్వాత ఏకమైన పూర్వ విద్యార్థులు

  • ఉపాధ్యాయులతో పంచుకున్న చిన్ననాటి జ్ఞాపకాలు

నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్. సి. (రాఘవుల శ్రీనివాసు):

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో 23 ఏళ్ళ తర్వాత ఏకమైన పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఒక్కచోట కలుసుకున్నారు. ఉషోదయ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఆధ్యాంతం ఆకట్టుకుంది. 2001-02 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు తమకు పాఠశాల స్థాయిలో విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. బాల్య మిత్రులతో అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రెండు దశాబ్దాల తర్వాత అందరూ ఒక్కచోట కలవడం పట్ల పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఆనంతరం నాటి ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు జ్ఞాపికలు అందజేసి, శాలువాలతో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా నాడు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు మాట్లాడుతూ పాఠశాలలలో చదివిన ఎందరో విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నందుకు గర్వపడుతున్నామని అన్నారు. ప్రతి ఓక్కరు దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకులు వీరస్వామిగారు, సత్యరాజ్, గోపాల్, శ్రీనివాస్, మరియు 35 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళ నిర్వహాణకు కృషిచేసిన నాగుల విక్రమ్, డాక్టర్ ఉమేష్, మరియు కుమార్ లను పలువురు అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News