Friday, March 13, 2026

బ్రిడ్జి జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకుల సమావేశం

  • హాజరైన మాజీ సర్పంచులు ఎంపీటీసీలు

నేటిసాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం బెజ్జంకి, ఇల్లంతకుంట మండల అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో మానేరు బ్రిడ్జి సాధన సమితి చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమానికి గన్నేరువరం మండలంతో పాటు వివిధ మండల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు, నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి గన్నేరువరం నుండి కరీంనగర్ కు మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, బ్రిడ్జి నిర్మాణం కరీంనగర్ లోని సప్తగిరి కాలనీ స్మశాన వాటిక నుండి ఒక కిలోమీటర్ పావుమేర మైసమ్మ గుట్ట వరకు గన్నేరువరం మండల కేంద్రానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లయితే అన్ని మండల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని మరియు మైలారం మల్లికార్జున స్వామి దేవస్థానం,ఖాసీంపేట శ్రీ స్వయంభు మానస దేవి ఆలయం పారువెళ్ల శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు వెంకటేశ్వర స్వామి ఆలయం, బేగంపేట ఆనందయ్య (మఠం) ఆలయం, బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దర్శనానికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా మైసమ్మ గుట్ట వద్ద ప్రభుత్వ భూమి 1000 ఎకరాల స్థలం ఉన్నందున ఈ భూమిని ప్రభుత్వం పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా ఉంటుందని అన్నారు. దీన్ని పరిగణంలోకి తీసుకొని మొదటి ప్రాధాన్యతగా దీన్ని చేపట్టాలని కోరుతున్నారు. వీలైనంత తొందరలో బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని మూడు మండలాల అఖిలపక్ష నాయకులు ఏకాగ్రీవంగా తీర్మానం చేశారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, సిపిఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి, సిపిఐ ఎంఎల్ బామండ్ల రవీందర్,బిజెపి మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఇల్లంతకుంట బిజెపి మండల అధ్యక్షులు అనిల్, మైలారం మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు పురంశెట్టి బాలయ్య, గువ్వ వీరయ్య, సత్తయ్య, గన్నేరువరం బిజెపి జిల్లా నాయకులు పుల్లెల రాము, వరాల సతీష్,బీఆర్ఎస్ నాయకులు మర్రి వెంకట మల్లు, గువ్వ పరుశరాములు, సుధాకర్,బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News