Friday, March 13, 2026

హుజురాబాద్ పై కరీంనగర్ ఘన విజయం

మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక -శ్రీనివాస్

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
కరీంనగర్ జిల్లా పట్టణంలో ఆదివారం అండర్ 16 కబడ్డీ పోటీలు ఆదివారం స్థానిక ఐస్ క్రీడామైదానంలో ఉత్కంఠ బహితంగా పోటీలు సాగాయి. బాలికల విభాగంలో 16 జట్లు పాల్గొన్నాయి. బాలుర విభాగంలో 22 జట్లు పాల్గొన్నాయి. హుజురాబాద్ వర్సెస్ బాలికల భాగంలో కరీంనగర్, హుజురాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హుజురాబాద్ పై కరీంనగర్ విజయం సాధించింది. బాలుర విభాగంలో హుజురాబాద్ వర్సెస్ కరీంనగర్ జట్ల మధ్య ఫైనల్ జరుగగా కరీంనగర్ జట్టు 41 పాయింట్లు సాధించగా హుజురాబాద్ జట్టు 61 సాధించి, 20 పాయింట్లు తేడాతో విజయం సాధించింది.

బహుమతులు ప్రధానం చేసిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ… చదువుతోపాటు క్రీడలు ఎంతో గాను ఉపయోగపడతాయని, దేహ దారుణ్యాన్ని పెంచుతాయని క్రీడలకు సూచించారు. గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలని, క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యంరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్, నిర్వాహకులు సునీల్ రెడ్డి, నేరేటి రమేష్, రవీందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News