
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
హన్మకొండ రాయపురలో నూతనంగా ఏర్పాటు చేసిన లలితా జ్యువెలర్స్ 57 బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, లలితా జ్యువెల్లర్స్ ఎండీ ఎం. కిరణ్‌కుమార్ తో కలసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య లలితా జ్యువెల్లర్స్ షోరూమ్ ను ప్రారంభించారు. అనంతరం ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ.. వ్యాపార రంగంలో హైదరాబాద్ తరువాత వరంగల్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇలాంటి వ్యాపార సంస్థల ఏర్పాటుతో ఎంతో మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. వరంగల్ ప్రజలు నగల కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా లలితా జ్యువెలరీ మనకు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజల మన్ననలు పొందుతున్న యాజమాన్యాన్ని ఎంపీ అభినందించారు. వినియోగదారులకు నాణ్యమైన బంగారు ఆభరణాలను అందుబాటు ధరలలో అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




