Friday, March 13, 2026

నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి గ్రామానికి చెందిన అంగడి వైశాలి హైదరాబాద్ లో పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం చదువుతుంది. అయితే ఇటీవల వైశాలి తల్లీ మరణించగా చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని విద్యార్థిని వైశాలికి హన్మకొండ కనకదుర్గ కాలనిలోని ఎమ్మెల్యే నివాసంలో కడియం ఫౌండేషన్ ద్వారా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ. 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేదరికం చదువుకు అడ్డుకాకూడదని, చదువుతోనే పేదరికన్ని జయించాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. క్రమశిక్షణ, నిబద్దతతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మదాసి అరుణ యాదగిరి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాద కుమారస్వామి, మాచర్ల సదానందం, రమ, స్వరూప, శారద తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News