- ఏమ్మేస్పి సీనియర్ నాయకులు
- ఆరెపల్లి పవన్ మాదిగ
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : మాదిగ డప్పు కళాకారుల ఆధ్వర్యంలో జరిగే సాంస్కృతిక ప్రదర్శన విజయవంతం కోసం హనుమకొండ జిల్లాలోని ప్రతి గ్రామం నుండి మాదిగలు మాదిగ ఉప కులాలు డప్పులతో వేలాదిగా తరలివచ్చి ఎస్సీల వర్గీకరణ సాధనలో ముందు వరుసలో ఉండాలని ఏమ్మెస్పి సీనియర్ నాయకులు ఆరేపల్లి పవన్ మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ, కవులు, గాయకులు, కళాకారులు, మేధావులు, ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు. ఎస్సీ ల వర్గీకరణ సామాజిక న్యాయాన్ని కోరే ఎస్సీ ఎస్టీ, బీసీ, ఆగ్రకుల మేధావులు మాతో పాటు వచ్చి. ఎస్సీ ల వర్గీకరణ సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.




