నేటి సాక్షి, బెజ్జంకి:
సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గాన్ని ఆదివారం హుస్నాబాద్ లో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండలానికి చెందిన పుల్లూరి ప్రభాకర్, బేజుగం సురేష్ కుమార్ లను జిల్లా కార్య వర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర యూత్ కార్యదర్శిగా చింత కింది శ్రీనివాస్ గుప్తను ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన సభ్యులు తెలిపారు.




