Thursday, March 12, 2026

పసుల రామ్మూర్తి ని వెంటనే అరెస్టు చేయాలి

  • ఎం ఆర్ పి ఎస్ కే టి దొడ్డి మండల ఇంచార్జి గువ్వలదిన్నె జంబయ్య

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా కే టి దొడ్డి మండలం : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తిని అరెస్టు చేసి, శిక్షించాలని ఎమ్మార్పీఎస్ కె టి దొడ్డి మండల ఇంచార్జి గువ్వలదిన్నె జంబయ్య మాదిగ కే టి దొడ్డి మండలం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఘునాథం కి కంప్లైంటు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎస్సీ కుల వర్గీకరణ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో హక్కులు సాధించుకునే దిశగా ఉవ్వెవ్వుత్తున ఉద్యమం కొనసాగుతున్న సమయంలో జీర్ణించుకోలేని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి తేది 18 జనవరి 2025 న పత్రిక ముఖంగా మాట్లాడుతూ… ఎస్సీ కుల వర్గీకరణ కొరకు మందకృష్ణ మాదిగ మాట్లాడితే కొట్టి చంపుతామని, మందకృష్ణ మాదిగపై కుట్రపూర్తిగానే బహిరంగ ప్రకటన చేసిన పసుల రామ్మూర్తి అరెస్టు చేసేదాకా ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గువ్వలదిన్నె అధ్యక్షులు కె మాశప్ప సీనియర్ నాయకులు మసీదు తాయప్ప,గోపి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News