Thursday, March 12, 2026

ఎవరి వాటా ఎంత ?

  • అధికార పార్టీ లీడర్ల అండతో జోరుగా ఇసుక రవాణా
  • రాత్రి అధికారులు దాడులు లేకపాయే
  • జోరుగా అక్రమ ఇసుక రవాణా
  • మండలంలోని ఆకేరు వాగుల నుంచి ఇసుక తరలింపు
  • అధికారుల అండదండలతో అందినకాడికి దండుకుంటున్న వైనం
  • యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
  • దృష్టి పెట్టని అధికారులు

నేటి సాక్షి భూక్య రవినర్సింహులపేట, జనవరి 19 : మండల వ్యాప్తంగా రాత్రి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుకాసురులు ఆకెరు వాగుల నుంచి యథేచ్ఛగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రాజకీయ అండదండలున్న కొంతమంది దీనినే ప్రధాన వృత్తిగా ఎంచుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. మండలంలోని జయపురం, కౌసల్యాదేవిపల్లి, రామన్నగూడెం, కొమ్మలవంచ, బొజ్జ‌న్న‌పేట‌ గ్రామాల్లో రాత్రి అనధికార ఇసుక ర్యాంపులు కొన‌సాగుతున్నాయి. అర్ధరాత్రుళ్లు, తెల్లవారుజూమున సైతం ఈ వాగులో ఇసుక త‌వ్వ‌కాల‌కు రాత్రి ఎలాంటి అనుమ‌తుల్లేన‌ప్ప‌టికి ఇష్టారాజ్యంగా త‌వ్వ‌కాలు జ‌రుపుతూ లూటీ చేస్తున్నారు. ఎవరైనా అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన అధికారులు, పోలీసులు చూసీచూడన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దృష్టి పెట్టని అధికారులు

కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదని తెలుస్తున్నది. గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను మండలంలోని పెద్దనాగరం స్టేజ్ గుండా జాతీయ రహదారిపై వరంగల్ ఖమ్మం యతెచ్చాగా నడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని, రామన్నగూడెం గ్రామం నుండి రాత్రి అనధికార ఇసుక ర్యాంపులు కొన‌సాగుతున్నాయి. అది కూడా రాత్రి 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు ఒక్కో ట్రాక్టర్ కు రూ.25 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే వాగుల్లో ట్రాక్టర్లతో ఇసుక తరలించడం మరో ఎత్తు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారు. ఎవరైనా అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన అధికారులు, పోలీసులు చూసీచూడన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణాపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News