Thursday, March 12, 2026

మానవత్వం చాటుకున్న సేవాలాల్ సోషల్ సర్వీస్, మానాల గోర్ ఎంప్లాయిస్ వింగ్

  • మృతుడి కుటుంబానికి 50 వేల ఆర్థిక సహాయం అందజేత

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం లోని సర్పంచ్ తండా గ్రామానికి చెందిన భూక్యా ప్రవీణ్ అనే యువకుడు ఈ నెల 13న రోర్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రవీణ్ కు భార్య పూజిత ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతి చెందిన ప్రవీణ్ పెద కుటుంబాన్ని మానవత దృక్పథంతో అదుకోవడానికి సేవాలాల్ సోషల్ సర్వీస్ తోపాటు మానాల గోర్ ఎంప్లాయిస్ వింగ్ ఆధ్వర్యంలో రూ. 50,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని పోస్ట్ ఆఫిస్ లో డిపాజిట్ చేసి బండ్ పేపర్ ను ప్రవీణ్ భార్య పూజిత కు అందచేశారు. ఈ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ప్రవీణ్ కు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారని ప్రవీణ్ కుటుంబాన్ని దాతలు మరియు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సోషల్ సర్వీస్ మరియు మానాల గోర్ ఎంప్లాయీస్ వింగ్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News