Thursday, March 12, 2026

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని ఆదివారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి వనిత కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఐలయ్య సతీమణి వనితకి ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలుకగా స్వామి వారికి కోడె కట్టి ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు ఎమ్మెల్యే సతీమణికి వారి కుటుంబ సభ్యులకు వేద పండితులు నాగిరెడ్డి మండపంలో వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆలయ అర్చకులు అధికారులు వున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News