
నేటిసాక్షి, వీణవంక:
హైదరాబాద్ రామకోటిలోని బీసి సాధికారత సంస్థ భవనంలో ఆదివారం రోజున జరిగిన తెలంగాణ ముదిరాజ్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో కరీంనగర్ జిల్లా ముదిరాజ్ జేఏసీ చైర్మన్ గా వీణవంక మండలం, మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోనెల సమ్మన్న ముదిరాజును నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు పోల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్ నియామక పత్రాన్ని అందజేశారు. ప్రధాన కార్యదర్శిగా జమ్మికుంటకు చెందిన నాగకృష్ణ ముదిరాజును, వైస్ చైర్మన్ గా చిగురుమామిడికి చెందిన నెల్లి శంకర్ ముదిరాజులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పొల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్, స్టేట్ జనరల్ సెక్రేటరీలు అల్లంపల్లి రామకోటి ముదిరాజ్, జీ. రాధాకృష్ణ ముదిరాజ్, చిన్న రాములు ముదిరాజ్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లింగాల పుష్పలత ముదిరాజ్, జనరల్ సెక్రెటరీ నీరజ ముదిరాజ్, బండి గోపాలకృష్ణ ముదిరాజ్, వీణా మాధురి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.





