- పెద్దపులి నాగారం గ్రామం నుండి పెద్ద గోల్కొండ రింగ్ రోడ్డు వరకు 33 ఫీట్ల రోడ్డు
నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామం నుండి ఎన్నో రోజుల నుండి పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్డు వరకు గుంతల మయంగా మారిన రోడ్డుని పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్ మరియు మాజీ సర్పంచ్ బండారి లావణ్య లింగం ముదిరాజ్ చొరవతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తక్షణమే రోడ్డు సబితా ఇంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపులి నాగారం గ్రామం నుండి పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్ వరకు 33 ఫీట్ల రోడ్డు పనులు వేగవంతం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, మరియు మాజీ సర్పంచ్ బండారి లావణ్య లింగం ముదిరాజ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




