నేటి సాక్షి, ధర్మపురి ప్రతినిధి, ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : బుగ్గారం మండల ఎస్సై శ్రీధర్ రెడ్డి సూచన మేరకు తాండ్ర సత్యనారాయణరావు యశ్వంతరావుపేట ఆర్థిక సహాయం తో బుగ్గారం ఎక్స్ రోడ్డు వద్ద రెండు సోలార్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సిసి కెమెరాల ఏర్పాటుకు సహాయం చేసిన సత్యనారాయణ రావు ను ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. మండలంలోని ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.




