Friday, March 13, 2026

అంబేద్కరిస్టులు ప్రజా సమస్యలపై పోరాడాలి

  • తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి భూపెల్లి మల్లేష్
  • మాల మహానాడు నూతన మండల కమిటీ ఎన్నిక

నేటి సాక్షి, లక్షెట్టిపేట ( బైరం లింగన్న) : అంబేద్కరిస్టులు ప్రజా సమస్యలపై పోరాడాలని మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి భూపెల్లి మల్లేష్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలో విశ్రాంతి భవన ఆవరణలో మాలమహానాడు మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులతో కలిసి అయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన తిరిగి దళితుల హక్కులకై పోరాడాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో యువత ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఓటు హక్కు కల్పించింది డాక్టర్ బాబా సాహెబేనని అన్నారు. అనంతరం పాత కమిటీ ని రద్దు చేస్తూ నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా దుంపల భాస్కర్, ప్రధాన కార్యదర్శి దాకూరి సాయికుమార్, కోశాధికారి బొల్లెట్ల విజయ్, ఉపాధ్యక్షులు ఆశాది చిన్నయ్య,బన్న శ్రీనివాస్, బబ్బెరి సుధాకర్, బైరం రవి, సూరమర్ల లింగయ్య, సూరి మల్ల ఏసన్న, కడ మండ సుధాకర్, కృష్ణ, దాసరి దినేష్, మినుముల వేణు, గౌరవ సలహాదారు జక్కుల రాజలింగు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్,స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్, లు నియామక పత్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో జాతీయ కార్యదర్శి ధమ్మ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి మాలెం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవి కుమార్, జిల్లా నాయకులు బైరం లింగన్న, తోగరు రాజు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News