- ఐటిఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నైటీ సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : పెద్దపల్లి ఐటిఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఐటిఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, 6 ట్రేడ్ లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు ఐటిఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటిసి ( అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని,జనవరి నెలాఖరులోపు నిర్మాణ పనులు పూర్తి చేసి పరికరాలను అమర్చెందుకు అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ తెలిపారు. 6 ట్రేడ్ కోర్సులకు సంబంధించి పరికరాలు ఐటిఐ కు చేరుకున్నాయని, భవన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే 25 రోజులలో సంబంధిత పరికరాలను ఇన్ స్టాల్ చేసి యువతకు శిక్షణ తరగతులు ప్రారంభించవచ్చని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. చివరి దశలో ఉన్న భవన నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఐటిఐ ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




