Friday, March 13, 2026

గుంటూరు పల్లి రెడ్ల పై చర్యలు తీసుకోవాలి

నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) :
ఎలకలపల్లి గ్రామంలో పత్రిక సమావేశాన్ని జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం. జరిగింది.సమావేశంలో ఈనెల 14న జరిగిన స్మశాన వాటికకు సంబదించిసాంఘిక, సామాజిక బహిష్కరణ చాలా హేయమైన చర్యగా భావించి పెద్దపల్లి జిల్లా ముఖ్య యాదవ నాయకులు విచ్చేసి ఎలకలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాగం శ్రీనివాస్ యాదవ్. మద్దతుగా సమావేశాన్ని గ్రామంలో ఉన్న వివిధ కులాల పెద్దల సమక్షంలో అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ శిలారపు పర్వతాలు యాదవ్, జికేఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పరి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎలకలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాగం శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి జరిగిన సాంఘిక, సామాజిక బహిష్కరణను గ్రామస్తులతో పాటుగా జిల్లాయాదవ సంఘం ఖండిస్తున్నదని,సమాజంలో ఉన్న అందరికీ జరిగిన అవమానమని, ఎల్కలపల్లి స్మశాన వాటిక ప్రభుత్వ స్థలంలో ఉన్నదని ప్రభుత్వ నిధులు వినియోగించి నిర్మించిన స్మశాన వాటికలో అన్ని వర్గాల ప్రజలకు హక్కు, అనుమతి ఉంటుందని అట్లాంటి స్మశాన వాటికకు గుంటూరు రెడ్లుగా చెప్పబడే ఒక వర్గం మాకే సొంతం మీరు ఎవరు కూడా ఈ స్మశాన వాటికకు రాకూడదు. ఇది మా గుంటూరు రెడ్లు మాత్రమే ఇందులో కార్యక్రమాలు చేసుకుంటాం, మీకు ఇక్కడికి రావడానికి అనుమతి లేదని బహిష్కరిస్తున్నమని అంటే పోలీస్ సహకారంతో ఖననం చేసుకునే పరిస్థితి వచ్చిందని ఇక్కడికి వచ్చిన వారందరం కూడా ఖండిస్తున్నామని మీద రాగం శ్రీనివాస్ యాదవ్ పోలీస్ స్టేషన్లు పిటిషన్ ఇచ్చి ఉన్నారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అరెస్టు చేయలేదని వెంటనే అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వ స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని కబ్జాకు గురైన స్థలాలను మళ్లీ ప్రభుత్వం స్వాధీన పరుచుకుంటదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి స్థానిక ఎమ్మెల్యే వరకు చెబుతున్న వాగ్దానాలను ఉటంకరిస్తూ ప్రభుత్వ స్థలాలను ఈ గ్రామంలో 100 ఎకరాల పైన గుంటూరు రెడ్లు ఆక్రమించి అనుభవిస్తున్నారని వాటికి వెంటనే ప్రభుత్వం స్వాధినపర్చుకోవాలని, కబ్జా చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని. తెలంగాణ ఉద్యమంలో గుంటూరు రెడ్ల పైన దాడులు జరుగుతే ఎలకలపల్లి గ్రామస్తులు ఇండ్లలోనే ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి కాపాడుకుంటే ఈరోజు మానవీయ కోణంలో కూడా ఆలోచించక సామాజిక, సాంఘిక బహిష్కరణలు చేయడం అవమాననీయమని అన్నారు. వారం రోజుల్లో అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని జిల్లా స్థాయినుండిరాష్ట్రస్థాయి వరకు కార్యక్రమాలతో సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు సిద్ధం చేస్తామని, పోలీస్ శాఖ ప్రభుత్వం వెంటనే గుంటూరు రెడ్ల పైన చర్యలు తీసుకుంటూ అరెస్టు చేయాలని ఎమ్మార్వో ప్రభుత్వ స్థలాలను సర్వే చేయించి ప్రభుత్వ స్థలంలో ఉన్న స్మశాన వాటికకు బోర్డు ఏర్పాటు.చేయాలని కోరారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అగ్రవర్ణాలుగా గుంటూరురెడ్ల పైన ఈ సమస్యలను పరిష్కరించాలని పత్రికాముఖంగా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో మేకల కొమురయ్య, బక్కతట్ల కుమార్, పల్లె శ్రీనివాస్, రాజమణి, గ్రామ అధ్యక్షుడు వినోద్, మల్లెత్తుల నాగరాజు, ఐలన్న, పెద్దకొమురయ్య, ఆర్కుతి కొమురయ్య, వరుణ్, సతీష్, తదితరులుపాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News