నేటి సాక్షి,రామడుగు (పురాణం సంపత్): రామడుగు మండలంలోని గుండి గోపాలరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా డిఎం అండ్ హెచ్ ఓ వెంకటరమణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి, ఐపి లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబ్ రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసవాలను జాగ్రత్తగా నిర్వహించాలని ఏదైనా కఠినతరంగా ఉంటే వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట డిపిఓ స్వామి స్థానిక వైద్యాధికారిని గ్రీస్మోనియా తదితరులు ఉన్నారు.




