Friday, March 13, 2026

మంచి లైబ్రరీలు మంచి సంస్థలకు మూలాధారం

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)

జాతీయ సాంకేతిక సంస్థ నిట్ వరంగల్ రెండు రోజులపాటు నిట్ లైబ్రేరియన్లు మరియు పబ్లిషర్లు కాంక్లేవ్‌ ను నిర్వహిస్తోంది. ఈ కాంక్లేవ్ ప్రారంభ కార్యక్రమం అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్‌లో జరిగింది. తెలంగాణ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ డా..ఎమ్.డి. రియాజ్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో దీప ప్రజ్వలన అనంతరం, నిట్ వరంగల్ లైబ్రేరియన్ డా. వై. శ్రీనివాస రావు ఈ కార్యక్రమానికి సంబంధించిన అవలోకనాన్ని అందించారు. లైబ్రరీ అడ్వైజరీ కమిటీ చైర్మన్, నిట్ వరంగల్ ప్రొఫెసర్ ఆనంద్ కిశోర్ ఆరంభ ప్రసంగాన్ని అందించారు. ప్రారంభోత్సవంలో ప్రసంగించిన నిట్ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి లైబ్రరీను అభినందించారు. వివిధ నిట్ ల లైబ్రేరియన్లు నిట్ వరంగల్ సందర్శించడం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. “మంచి లైబ్రరీలు మంచి సంస్థలకు మూలాధారం” అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ డా. ఎమ్.డి. రియాజ్ వరంగల్ చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరించారు. ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు నిట్ వరంగల్‌ ను అభినందించారు. ఈ రెండు రోజుల కాంక్లేవ్ నిట్ ల లైబ్రరీలకు అమూల్యమైన ప్రయోజనాన్ని అందిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి సంస్థలకు లైబ్రరీల ప్రాధాన్యతపై మాట్లాడారు. ఈ రెండు రోజుల కాంక్లేవ్‌లో లైబ్రేరియన్లు మరియు పబ్లిషర్లు లైబ్రరీ సైన్స్‌లో వివిధ అంశాలపై తమ అనుభవాలను పంచుకోనున్నారు. మొత్తం 14 సెషన్లు జరగనున్నాయని ప్రొఫెసర్ ఆనంద్ కిశోర్ మరియు డా. వై. శ్రీనివాస రావు తెలిపారు. వివిధ నిట్ ల నుండి సుమారు 80 మంది పాల్గొంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News