నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో జరిగే మంద కృష్ణ మాదిగ సభా కార్యక్రమాల విజయవంతం కోసం, సోమవారం, గోదావరిఖని పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ శాసన సభ్యులు కాసిపేట, లింగయ్య, కోటగిరి పాపయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో రామగుండం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ ప్రాంతాల నుండి పార్టీలకు రాజకీయాలకు కార్మిక సంఘాలకు దళిత సంఘాలకు అతీతంగా పాల్గొనడం జరిగింది.




