- ఘనంగా సనాతన సాదు సన్మాన సమ్మేళనం
- ఆర్ హెచ్ వి ఎస్ చే డెహ్రాడూన్ లో విజయవంతంగా ఆధ్యాత్మిక సదస్సు
- మార్చిలో తిరుపతి నుంచి అయోధ్య వరకు శ్రీరామ రథయాత్ర
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): తిరుపతి నుంచి అయోధ్య వరకు మార్చి నెలలో శ్రీరామ రథయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో డెహ్రాడూన్ లో ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించి హిందూ సనాతన సాధువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కల్కి భగవాన్, రమేష్ చంద్ర ద్వివేది, నవీన్ చంద్ర శుక్ల మాట్లాడుతూ హిందూ భావజాలాలను, ఆధ్యాత్మికతను, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత నేటి యువతీ యువకులపై ఉందన్నారు. మార్చి నెలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నుంచి అయోధ్య వరకు 45 రోజులపాటు శ్రీరామరథ యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఊరువాడలలో శ్రీరామ నామ భజనలతో శ్రీరామ జెండాను ప్రతి ఇంటి పై ఎగురవేసేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాఖండకు చెందిన ప్రముఖులు వినోద్ చమౌళి, ఖజాందాస్, అనిల్ గుప్తా, పండిత్ సుభాష్ జోషి, విపిన్ జోషి, రమేష్ చంద్ర ద్వివేది, నవీన్ చంద్ర శుక్ల, మహారాష్ట్ర కు చెందిన కల్కిమహారాజ్ జీ,శ్రీ రామానంద సరస్వతి మహారాజ్, బాపూజీ, రాములుజి, రవీంద్రపురి, కృష్ణ కిషోర్, గుండ్రాజు సుకుమార్ రాజు అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు, హిందూ సనాతన ఆధ్యాత్మిక ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతోందన్నారు. ఇందుకు తగ్గట్టు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించి ధర్మ ప్రచారం కోసం చర్యలు చేపట్టాలన్నారు. గౌరవ్ జైన్, పూజ సింగ్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో సంజయ్ గర్గ్, లోకేష్ సింగ్, పూజా సింగ్, సీమ సింగ్, గౌరవ్ జాన్, వినయ్ ప్రజాపత్ నితిన్ జైన్, హరీష్ బిజులవాన్, సిబ్బే శేషు వాన తదితరులకు అయోధ్య శ్రీరామ మందిరం చిత్ర పటం మెమెంటో తో పాటు శాలువా కప్పి రామనామ స్పటిక మాలను వేసి ఘనంగా సన్మానించారు.




