Friday, March 13, 2026

నటరాజ్ కు సుభాష్ చంద్రబోస్ జాతీయ ఐకాన్ అవార్డు

నేటిసాక్షి, రాయికల్: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన జానపద కళాకారుడు బోదనపు నటరాజ్ కు సుభాష్ చంద్రబోస్ జాతీయ ఐకాన్ అవార్డును సోమవారం అందుకున్నారు. అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ 5వ వార్షిక మహోత్సవ సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతిలో సోమవారం నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో నట్రాజ్ ఈ అవార్డును మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగ అందుకున్నారు. జానపద కళాకారుడిగా నట్రాజ్ ఇరవైనాలుగు సంవత్సరాలుగా సామాజిక, ఉద్యమ, జానపదగేయ కళాకారుడిగా రాణిస్తున్నారు. ఈ మేరకు ఈ అవార్డును అందించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సరోజనమ్మ తెలిపారు.అవార్డు అందుకున్న నటరాజ్ ని పలువురు కళాకారులు,కళాభిమానులు అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News