- జోగులాంబ గద్వాల జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎల్కూర్ శ్రీనివాస్ గారుకి వినతిపత్రం అందచేత
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్, తాలూకా అధ్యక్షుడు కృష్ణంరాజు,మార్కెండేయ దిలీప్,రవీంద్ర,విక్రమ్ డిగ్రీలు, పీజీలు చేసినటువంటి నిరుద్యోగ యువత కోసం వారికి గ్రంథాలయం గ్రామాలలో లేక ప్రభుత్వం నిర్వహించే కాంపిటేట్ పరీక్షలు నిమ్మితం చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని కావున మా గ్రామానికి అదేవిధంగా గట్టు మండలం మాచర్ల గ్రామానికి లైబ్రరీలు ఏర్పాటు చేయించి ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగాల పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించే అవకాశాలను గ్రంథాలయాల ద్వారా కల్పించగలరని జోగులాంబ గద్వాల జిల్లా గ్రంధాలయం చైర్మన్ శ్రీనివాస్ గారికి వినతి పత్రం ద్వారా కోరడం జరింగింది ఈ సందర్బంగా గ్రామాలలో గ్రంధాలయాలు ఏర్పాటు కృషి చేస్తానని చైర్మన్ గారు తెలియచేసారు




