- జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం నాయకులు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో పాలమూరు ప్రజా వీరుడు,తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న ముదిరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం కొరకై మునిసిపల్ కార్యాలయంలో చైర్మన్ బి.ఎస్ కేశవ్ కి జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు ముదిరాజ్ మత్స్యకారువ సంఘం అధ్యక్షులు కబీర్ దాస్ నరసింహులు ముదిరాజ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. గద్వాల నియోజవర్గంలో అత్యధిక జనాభా గల తెలుగు ముదిరాజ్ కులస్తుల కోరిక మేరకు పండుగ సాయన్న ముదిరాజ్ విగ్రహం ఏర్పాటుకై కౌన్సిల్ తీర్మానం ఇవ్వగలరని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోట జనార్ధన్,జిల్లా సహాయక కార్యదర్శి ఆంజనేయులు, గద్వాల్ తాలూకా అధ్యక్షులు TNR జగదీష్,గద్వాల్ తాలూకా ప్రధాన కార్యదర్శి దడవై నరసింహ, గువ్వల గోపాల్, కేకే బాయ్, చాపల చిన్న, క్రిష్ణ, బీరెల్లి ఓంకార్, కొత్తపల్లి సత్యం, గద్వాల్ పట్టణ యువజన అధ్యక్షుడు రఘు (TMR), గద్వాల్ పట్టణ యువజన ప్రధానకార్యదర్శి ప్లంబర్ జగదీష్, గంగలరాము, నాగేంద్రబాబు, వెంకటేష్ గడ్డ, కబీర్ దాస్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.




