Friday, March 13, 2026

స్థానిక సంస్థల నిధులలో సింహ భాగం కేద్రం ప్రభుత్వం దే

  • బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్.రామచంద్రారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : సోమవారం రాజోలి మండల కేద్రం లో రాజోలి, వడ్డేపల్లి మండలం, వడ్డేపల్లి మునిసిపల్ అధ్యక్షులు & జిల్లా కౌన్సిల్ సభ్యుల నూతనంగా ఎన్నిక ఐన అధ్యక్షులు శశికుమార్, నాగరాజు, రామకృష్ణ జిల్లా కౌన్సిల్ సభ్యులు కోట్ల వీరేష్ రెడ్డి, హరి కృష్ణ, మురళి యాదవ్ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈరోజు దేశం లో స్థానిక సంస్థలు బలోపేతం & అభివృద్ధి కి మాన్య శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ జీ చొరవ తో అని 2014 కు పూర్వం సంకీర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తల ఒక్కిటికీ 170 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు మోడీ జీ ప్రధాని ఐన తర్వాత 900 రూపాయలకు పైగా ఇస్తున్నారు. అని ఉదాహరణకు సీసీ రోడ్స్, టాయిలెట్స్, రైతు వేదికలు, వైకుంఠ దామలు, పల్లె ప్రకృతి వనాలు, ఉచిత బియ్యం, ట్రాక్టర్స్, పీఎం కిసాన్, ఎరువులకు భారీ రాయితీ, రైతుల పండించే పంట కు మద్దత్తు ధర తో పత్తి, వరి, అన్ని రకాల ధాన్యలు శేఖరణ, పీఎం విశ్వకర్మ, ముద్ర లోన్లు, పీఎం ఈ కే వై మొదలైన ఎన్నెన్నో పథకాలు మనం ఇస్తున్నాము అని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కేద్రం పథకాల గురించి ప్రజలకు వివరించండి అని అన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ 2023 గద్వాల అభ్యర్థి శివరెడ్డి, జిల్లా ఉప అధ్యక్షులు కె కె రెడ్డి, నాయకులు సంజీవ రెడ్డి, నరసింహులు, ఈసీ ఆంజనేయులు, రాము, బోసోజీ అంజి, కే రాము, భీమన్నా, తిరుపతి, దేవేందర్, పైపాడు వెంకటేష్ రాఘవేంద్ర తదితరులు పాలుగోన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News