- జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు
- బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
- పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : ఐజ మండలం బింగిదొడ్డి గ్రామానికి చెందిన కురువ వెంకటేష్ పై ఉప్పరి విరుపాక్షి అనే వ్యక్తి దాడి చేసి రెండు గొర్రెలు చంపేసిన ఘటనలో ఎస్సై చర్యలు తీసుకోకుండా 8 రోజులు అయితే కూడా కేసును పట్టించుకోకుండా తప్పుదోవ పట్టిస్తున్నాడని గ్రామ సంఘం నాయకులు తీవ్రమైన ఆందోళన చెందుతున్న సందర్భంగా వారి పిలుపుమేరకు ఈరోజు జిల్లా కేంద్రానికి చేరుకొని జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, మత్తాలి, సుంకన్న మరియు గ్రామ సంఘం నాయకులు సంఘటన జరిగి ఎనిమిది రోజులు అయితే కూడా స్థానిక ఎస్సై పట్టించుకోకుండా దాడి చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడం వల్ల బాధితుల పిలుపుమేరకు ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే రెండు రోజుల్లో ఆ వ్యక్తిని రిమాండ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరియు అక్కడే ఉన్న సిఐ గారు కూడా రెండు రోజుల్లో ఆ వ్యక్తిని రిమాండ్ చేస్తాం బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. న్యాయ వ్యవస్థ అన్యాయం జరిగిన బాధితుల వైపున నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే వ్యవస్థ పైన సామాన్య ప్రజలకు కూడా నమ్మకం ఉంటుందని అన్నారు. దాడి చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




