నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఆర్టీసీ బస్సు ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడు తున్న భార్యా భర్తలను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్దనుండి సుమారు 8 లక్షల 50 వేల రూపాయల విలువగల 100 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన దంపతులు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటారం గ్రామం ప్రస్తుతం హనుమకొండ కుమార్ పల్లి లో నివాసం ఉంటున్న చల్లి స్వప్న (27) మద్దూరి సత్యనారాయణ (38) లుగా గుర్తించడం జరిగింది. ఈ అరెస్ట్ కు సంబంధించి సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన దంపతుల్లో భర్త అయినా సత్య నారాయణ కులవృత్తి చేసుకొని జీవిస్తుండగా భార్య స్వప్న దివ్యాంగురాలు కావడంతో ఇంటి వద్దనే ఉండేది సత్య నారాయణకు వచ్చే ఆదాయం జల్సాలకు సరిపోక పోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని అనుకున్నారు. ఇందుకోసం ఈ కిలాడి దంపతులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేందుకు సిద్ధపడ్డారు. నిందితులు మొదటగా గత సంవత్సరం ఫిబ్రవరి మార్చ్ నెల మరియు డిసెంబర్ నెలలో హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న మహిళ వృద్ధురాలి మెడలో బంగారు పుస్తేత్రాడు ను నిందితురాలు స్వప్న చోరీ చేసి తన భర్తకు అందజేసింది. ఈ దంపతులు గత నెల డిసెంబర్ నెలలో మరో మారు హన్మకొండ బస్టాండ్ లో ఒకేరోజు బస్సు ఎక్కే క్రమంలో ఇద్దరు మహిళల మెడలో మరియు సైడు బ్యాగులో బంగారు ఆభరణాలను చోరీ చేశారు. చోరీ చేసిన సొత్తును నిందితులు తాము నివాసం ఉంటున్న ఇంటిలోనే భద్రపరిచేవారు ఈ చోరీల ని అప్రమత్తమైన హన్మకొండ పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ సూచనల మేరకు హనుమకొండ ఏసీబీ దేవేందర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు పోలీసులకు అందుబాటులో టెక్నాలజీని వినియోగించుకొని బస్టాండ్ లో చోరికి పలు పడుతున్న కిలాడి దంపతులను గుర్తించారు. ఇందులో భాగంగా చోరీ చేసిన చోరీ సొత్తును విక్రయించి సొమ్ము చేసుకోవాలని దంపతులు సోమవారం హనుమకొండ టైలర్ స్ట్రీట్ లో నడిచి వెళుతున్న సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఈ దంపతులు అనుమానంగా ఆపి తనిఖీ చేయగా వారి వద్ద బంగారు నగలు గుర్తించిన పోలీసులు కిలాడి దంపతులను అదుపులోకి తీసుకొని విచారించగా వీరు పాల్పడిన చోరీలను అంగీకరించారు. నిందితుల పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన ఏసీపి దేవేందర్ రెడ్డి హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీష్, అడ్మిన్ ఎస్ఐ అశోక్ కుమార్, క్రైమ్ ఎస్ఐ కిషోర్, ఏవో సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు నారాయణ, రాహుల్, కానిస్టేబుళ్లు ,మహేష్, అశోక్, వీరన్న, భాస్కర్, లను డిసిపి అభినందించారు.




