- ఎంఈఓ కు వినతి పత్రం అందించిన వర్కర్స్ యూనియన్
నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ పిలుపుమేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎం ఈ ఓ కు వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర పిలుపులో భాగంగా కార్మికులకు సరైన సమయంలో జీతాలు రాకపోవడం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన బిల్లులు సరిగా ఇవ్వకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్న కూడా విద్యార్థులకు కోడిగుడ్లు వారానికి మూడుసార్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని మార్కెట్లో కోడిగుడ్డు ధర ఎనిమిది రూపాయలకు ఉండగా ప్రభుత్వం మాత్రం కోడిగుడ్డు ధర 5 రూపాయల చొప్పున కట్టిస్తుందని, అందువల్ల వంటకార్మికులపై అదనంగా మూడు రూపాయల భారం పడుతుందని, అందుకే విద్యార్థులకు కోడిగుడ్లు వడ్డించలేకపోతున్నామని, తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోని మండలాల ఎం ఈ ఓ లకు మా సమస్యలు విన్నవించుకుంటున్నామని కార్మికులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మెనీపోస్టులో పెట్టిన విధంగా పదివేల గౌరవ వేతనం ప్రతి నెల 5వ తేదీ లోపల బిల్లులు మరియు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వంట కార్మికులకు ప్రమాదాలు జరిగినచో బాధ్యత వహించి వైద్య సహాయం చేయడంతో పాటు కార్మికులకు ఇన్సూరెన్స్ చేయాలని, పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




