Friday, March 13, 2026

చండ్రుగొండ మండల ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్

  • రిజిస్ట్రేషన్ అయిన సందర్భంగా నూతన కమిటీ ఎన్నుకొనుట జరిగింది

నేటి సాక్షి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మన్నె వీరేంద్ర ప్రసాద్ : ఈ కమిటీలో అధ్యక్షుడిగా షేక్ ఆసిఫ్, ఉప అధ్యక్షుడిగా దెబ్బెందుల బాబురావు, జనరల్ సెక్రెటరీ గా మన్నెం వీరేంద్ర ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా షేక్ హైమత్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా షేక్ ఆబిద్, ట్రెజరర్ గా షేక్ నజీర్, జాయింట్ ట్రెజరర్ గా షేక్ హబీబ్, కోర్ కమిటీ మెంబర్ గా షేక్ షావలి పా, గౌరవ సలహాదారులుగా పిట్టల రామ్ లక్ష్మణ్, కాకాటి లక్ష్మణ్, శ్రీను, బాదావత్ రమేష్, చారి లను సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా సభను ఉద్దేశించి అధ్యక్షుడు షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ చండ్రుగొండ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రిషన్ లేబర్ సభ్యత్వం తీసుకొని పనిలో జాగ్రత్తలు పాటిస్తూ కస్టమర్లకు నాణ్యమైన పనిని చేయాలని సూచించారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ ప్రతి ఎలక్ట్రిషన్ యూనియన్ లో సభ్యత్వం తీసుకొని పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంకులలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్లను కట్టుకొని కుటుంబానికి భరోసా కల్పిస్తూ పని పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు, సెక్రటరీ వీరేంద్ర మాట్లాడుతూ ప్రతి ఎలక్ట్రిషన్ చేసే వృత్తి ప్రమాదకరమైనది కాబట్టి గవర్నమెంట్ నుంచి ప్రమాద బీమా కింద వచ్చే ఆరు లక్షల రూపాయలను 10 లక్ష రూపాయల గా పెంచాలని గవర్నమెంట్ ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News