- ఆదివారం కరీంనగర్ ఫిలిం భవన్ వేదికగా ఆర్యాణి సకల కళా వేదిక ఆధ్వర్యంలో
- సంక్రాంతి ప్రతిభా పురస్కారాల ప్రధానం
నేటి సాక్షి,మంథని(పెయ్యల రమేష్):
విభిన్న రంగాలలో సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులను గుర్తించి వారిని తగు రీతిలో సత్కరిస్తూ ప్రోత్సాహాన్ని అందించడంలో ఆర్యాణి సకల కళా వేదిక ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని శతాధిక గ్రంథ ప్రచురణ కర్త భవానీ సాహిత్య వేదిక అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్ అన్నారు.ఆదివారం రోజున మధ్యాహ్నం కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో దూడపాక శ్రీధర్ అధ్యక్షతన జరిగిన శ్రీ ఆర్యాణి సకళ కళా వేదిక సంక్రాంతి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై గౌతమేశ్వర సాహితీ సేవా సంస్థ ప్రచురించిన ఇంతకీ నువ్వెవరు కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురస్కారాలు మన బాధ్యతలని మరింతగా పెంచుతాయని,సమాజ హితం కోసమే మనం ప్రయత్నించాలని అన్నారు.జ్యోతిష్య, వాస్తు,పౌరోహిత్యం,చిందు యక్షగానం,సాహిత్యం తదితర రంగాల్లో విశిష్టమైనటువంటి సేవలు అందించిన 73 మంది ప్రముఖులకు సంక్రాంతి ప్రతిభా పురస్కారాలను అందజేశారు.కార్యక్రమంలో ప్రముఖ స్త్రీ కంఠ గాయకులు డా.దీక్షితుల సుబ్రహ్మణ్యం,రచయిత పారిశ్రామికవేత్త ఓమర్ ఎజాస్ ఖాన్, ప్రముఖ కవి సమీక్షకులు పొర్ల వేణుగోపాలరావు, ప్రముఖ యోగా గురువు వి.కే. వి.కె. కళాధరరావు, కరీంనగర్ జిల్లా పతంజలి యోగాసమితి ప్రధాన యోగ శిక్షకులు బుర్ర లక్ష్మీనారాయణ,తెలంగాణ ఉద్యమ జానపద కళాకారులు ఢిల్లీ, ప్రముఖ స్త్రీఅలంకరణ నిపుణులు కలర్స్ బ్యూటీ క్లినిక్ కుంచాల లావణ్య,పారిశ్రామిక వేత్త అరిసెనపల్లి శ్రీనివాస్ మువ్వ హరీష్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.




