- మండల విద్యాధికారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు
నేటి సాక్షి,సైదాపూర్: సైదాపూర్ మండలంలోని సైదాపూర్, వేన్కేపల్లి గ్రామంలో సోమవారం గౌరవ మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యులు దేవేందర్ రెడ్డితో పాటుగా సీఆర్పీలు సోయం రమేష్, శ్రీనివాస్ రెడ్డి మరియు ఎల్లయ్య లు బడి బయట పిల్లల సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మండల విద్యాధికారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 6 నుండి 14సంవత్సరాల పిల్లలు కచ్చితంగా బడిలో ఉండాలని, బడి బయట ఎవరు ఉండకూడదు అని, అదేవిధంగా పిల్లలు ప్రతిరోజు బడికి పంపించే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు.




