Friday, March 13, 2026

ఇది జస్ట్ ట్రైల్ మాత్రమే ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో అసలు సినిమా

  • డప్పులతో దద్దరిల్లిన హనుమకొండ నగరం
  • భారీ ప్రదర్శనలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ
  • లక్ష డబ్బులు వేల గొంతులు ఓరుగల్లు లో సన్నాహక ర్యాలీ

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
సుప్రీం కోర్టుకు తీర్పుకు అనుగుణంగా ఎస్సి వర్గీకరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో లక్ష డబ్బులు వేల గొంతులు పేరిట నిర్వహించనున్న భారీ నిరసన కార్యక్రమానికి అనుగుణంగా సోమవారం హనుమకొండ లో డప్పు వాయిద్యాలు కళాకారులతో కలిసి సకల జనులతో సన్నాహక ర్యాలీ నిర్వహించారు. హనుమకొండ లోని వేయి స్తంభాల గుడి నుండి ప్రారంభమైన ర్యాలీ పబ్లిక్ గార్డెన్ సమీపం లోని అంబేద్కర్ సెంటర్ వరకు సాగింది. మాదిగలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ ర్యాలీలో పాల్గొన్నారు వేయి స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పూజ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ తో పాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, కొండేటి శ్రీధర్, గాయకులు మిట్టపల్లి సురేందర్, ఏపూరి సోమన్న, వరంగల్ శ్రీను, తదితర నాయకులందరూ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ర్యాలీ ఉత్సాహ భరితంగా సాగింది. డబ్బు చప్పుల్లతో హనుమకొండ ప్రాంతం మారు మోగింది. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరాటం న్యాయ మైన దప్పటికిని ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం పై పెద్ద ఎత్తున మాదిగలు నిరసించారు వర్గీకరణ తోనే మాదిగ మరియు మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని దీనికి మాల సోదరులు కూడా సహకరించాలని కోరారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ర్యాలీలో ఉమ్మడి వరంగల్ జిల్లా తో పాటు చుట్టూ ప్రక్కల జిల్లాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమం ముగించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News