నేటిసాక్షి, కొడంగల్:
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ డివిజన్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం కొడంగల్ మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన దీని గల నరసప్ప ఇటీవల గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈయన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పరిగి బ్రాంచ్ లో37000/- రూపాయలతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం జరిగింది. ఈయన భార్య నామిని దినిగల అనసూజకు 6,78,300/- రూపాయల బీమా చెక్కును కొడంగల్ మున్సిపల్ చైర్మన్ R. జగదీశ్వర్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎం శ్రీనివాస్, ఏరియా మేనేజర్ సురేష్, ఎగ్జిక్యూటివ్స్ శ్రీనివాస్, ఆంజనేయులు, కిషన్, ఆదిత్య, రాధిక, ఏజెంట్లు విజయలక్ష్మి, దస్తప్ప, అశోక్, రేణుక, నర్సిములు, సావిత్రా, మంజుల, అనిత, తదితరులు పాల్గొన్నారు.




