- మధ్యాహ్న భోజనం వర్కర్లకు 10 వేతనం ఇవ్వాలి
- ఏఐటీయుసీ జిల్లా ఉపాధ్యక్షులు వెన్న మహేష్ డిమాండ్
- సమస్యలు పరిష్కరించాలని ఎంఈఓ కు మధ్యాహ్న భోజనం వర్కర్ల వినతి
నేటి సాక్షి, జగిత్యాల బ్యూరో : మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి ₹.25రూపాయలు మెన్ ఛార్జీలు చెల్లించాలని, ఇప్పుడు చెల్లిస్తున్న రేట్లతో వంట చేయలేమని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు వెన్న మహేష్ పేర్కొన్నారు. ఏ ఐ టీ యు సీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్న భోజన వర్కర్లతో కలిసి మహేష్ జగిత్యాల మండల విద్యాధికారికి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వమే కోడిగుడ్డను సరఫరా చేయాలి. ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ మార్కెట్లో కోడిగుడ్డు ధర 8 రూపాయలుంటే ప్రభుత్వం 5 రూపాయలు చెల్లిస్తుందని ఒక్క కోడిగుడ్డుకు 3 రూపాయలు నష్టంతో మధ్యాహ్న భోజనం వర్కర్లు విద్యార్థులకు అందించలేరని, ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేయాలన్నారు. మార్కెట్ ధరలకనుగుణంగా మెనూ ఛార్జీలు లేనందున రెండు కూరలతో భోజనం పెట్టలేరని ఆయన పేర్కొన్నారు.వంట కార్మికులను తొలగించకుండా జిఓ జరిచేయడమే కాకుండా వంట కార్మికులకు ప్రభుత్వం ఇస్తామన్నా 10 వేతనం వెంటనే చెల్లించాలని మహేష్ డిమాండ్ చేశారు.వంట సందర్బంగా కార్మికులకు జరుగుతున్న ప్రమాదాల కోసం ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలన్నారు. గత 9నెలలుగా పెండింగులో ఉన్న కోడిగుడ్డు బిల్లులను వంట కార్మికులకు వెంటనే చెల్లించాలని మహేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం వంట కార్మికులు శారద, బీ.లక్ష్మీ, మల్లేశ్వరి,కె. లక్ష్మీ,జరిన, లత, రాధ, రజిత,జయశ్రీ, కవిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




