Friday, March 13, 2026

సర్వేలో ఎలాంటి అవకతవకలు ఉండకూడదు

నేటిసాక్షి :పెగడపల్లి (కె గంగాధర్) : పెగడపల్లి మండల పరిధిలోని నంచర్ల,నందగిరి ఐతపల్లి మరియు ఆరవెల్లి గ్రామాలను సందర్శించ్చిన మండల ప్రత్యేక అధికారి ఎస్ ఎల్ మనోహర్ ఆయా గ్రామాలలో జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలో భాగమైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మరియు ఆహార భద్రత కార్డుల సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. సర్వేలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకంగా చేయాలని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమపథకాలను అందజేయాలనీ క్షేత్రస్థాయి పరిశీలకులను ఆదేశించారు వీరితో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ రెడ్డి , మండల తహసిల్దార్ బి. రవీందర్ , మరియు మండల పంచాయతీ అధికారి మహేందర్ పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News