ఐదుగురిపై కేసు నమోదు.
నేటి సాక్షి, మెట్ పల్లి.
రహదారిపై పుట్టినరోజు వేడుకలు జరుపుకొని తల్వార్ తో న్యూసెన్స్ చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. పట్టణానికి చెందిన ఐదుగురు వ్యక్తులు గత నెల 26న రహదారిపై పుట్టినరోజు వేడుకలు జరుపుకొని తల్వార్ పట్టుకొని జనావాసంలో న్యూసెన్స్ చేశారని, తల్వార్ పట్టుకుని దిగిన ఫోటోను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. దీంతో ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.




