- ఉమ్మడి మండలంలో ఘటన
- మా ఆరోగ్య కేంద్రానికి చెందిన మందులు కావు – మండల వైద్యాధికారి

నేటిసాక్షి, ఎండపల్లి : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబరిపేట గ్రామంలోనీ డంపింగ్ యార్డులో ప్రభుత్వ మందులు దర్శనమీయడం స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంటే ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం మందులు పంపితే ఆ మందులు మాత్రం ప్రజలకు కనుచూపు మేరెలో కనిపించకుండా పోయి, కొన్ని సంవత్సరాల తర్వాత కాలం చెల్లుబాటు అయ్యాయి అంటూ చెత్తకుప్పల్లో, డంపింగ్ యార్డ్ లో పడవేయడం చర్చనీయమైన సంఘటనే ఈ ఘటన పై ప్రజలు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఇలా డంపింగ్ యార్డ్ లో వందల టానికు సీసాలు ఒకేసారి కనిపించడంతో ప్రభుత్వ సొమ్ము నేల పాలు అయ్యిందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మా ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన మందు సీసాలు కాదు : మండల వైద్యాధికారి డాక్టర్ లవ కుమార్ ఉమ్మడి మండలంలోని అంబరిపేట గ్రామ డంపింగ్ యార్డులో వందల సంఖ్యలో ప్రభుత్వ మందులు పడవేసి కాల్చివేయడం పై మండల వైద్యాధికారి డాక్టర్ లవ కుమార్ ను వివరణ కోరగా.. తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన మందు సీసాలు కావని ఆయన సమాధానమిచ్చారు. తమ ఆసుపత్రికి వచ్చిన మందు సీసాల బ్యాచ్ నెంబరు, డంపింగ్ యార్డులో ఉన్న మందు సీసాల బ్యాచ్ నెంబరు భిన్నంగా ఉన్నాయని ఆయన వివరించారు. గతంలో మంచిర్యాల జిల్లా నుండి వెల్గటూర్ మండల కేంద్రంలో పడవేసారని ఇప్పుడు కూడా అదే తరహాలో జరిగి ఉండవచ్చు అని తెలిపారు.

విచారణ జరుగుతుంది: జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్
పింగ్ యార్డ్ లో ప్రభుత్వ మందులు కనిపించడం చర్చనీయాంశంగా మారిందని, ఇట్టి విషయం తమ దృష్టికి వచ్చిందని జగిత్యాల జిల్లా వైద్య అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. ఎందుకు ఈ విధంగా జరిగిందో తెలుసుకునే కోణంలో విచారణ జరుగుతుందా అని ఆయన వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఎది ఏమైనా వేరే బ్యాచ్ నంబర్ తో కలిగిన ప్రభుత్వ మందులు అంబరిపేట గ్రామంలోనే ఎందుకు వేయాలి , గ్రామంలో చివరణ ఉన్న డంపింగ్ యార్డులో బయట వారు వచ్చి పడవేసే విషయంలో ఆంతర్యం ఏమిటి, బయట వారు వచ్చి పడవెస్తే దానిని కాల్చల్సిన అవసరం ఏమిటి , అనే విషయాల పై పలు అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు ప్రభుత్వ అధికారులే వచ్చి మందులను పడవేసినట్లు సమాచారం .దీనిపై సమగ్ర విచారణ జరిపి డంపింగ్ యార్డులో మందులు పడవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.





