Friday, March 13, 2026

ప్రజా పాలన గ్రామసభ

  • అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు
  • ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,
  • లబ్ధిదారులకు అందజేసినట్లు మాజీ సర్పంచ్, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కావలి దశరథ

నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం, చిక్కిరి శ్రీకాంత్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో 22 జనవరి 2025 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు ప్రజా పాలన గ్రామసభలో భాగంగా పెద్దపులి నాగారం గ్రామపంచాయతీ ఆఫీస్ నందు స్పెషల్ ఆఫీసర్ వి. నవతా అధ్యక్షతన ప్రజా పాలన గ్రామసభ నిర్వహించడం జరుగును.
మాజీ సర్పంచ్, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కావలి దశరథ మాట్లాడుతూ… గ్రామసభల ద్వారా గతంలో ఇచ్చిన దరఖాస్తుల పరిశీలన, కొత్త అప్లికేషన్లు మరియు లబ్ధిదారులైనటువంటి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు ఉంటాయి.
మన పెద్దపులి నాగారం గ్రామంలో నిర్వహించబోయే ప్రజా పాలన గ్రామసభ లో, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, లబ్ధిదారుల గుర్తింపు మరియు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఇట్టి అవకాశమును పెద్దపులి నాగారం గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ పెద్దపులి నాగారం గ్రామపంచాయతీ కార్యాలయం మాజీ సర్పంచ్, మాజీకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు కావలి దశరథ తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News