Friday, March 13, 2026

ప్రజాపాలన ప్రత్యేక గ్రామ సభ

పెగడపల్లి:నేటిసాక్షి (కె గంగాధర్) : పెగడపల్లి మండల పరిధిలోని శాలపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఎ. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ప్రజా పాలన ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలో భాగమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా కొత్తఆహార భద్రత కార్డులు మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకములకు అర్హులైన లబ్ధిదారుల యొక్క వివరములను గ్రామ సభలో గ్రామస్తుల సమక్షంలో ప్రత్యేక అధికారి చదివి వినిపించారు. జాబితాలో పేరు లేని వారి నుండి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది.వీరి పైన ఏమైనా అభ్యంతరములు ఉన్నట్లయితే తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రత్యేక అధికారి మం ప్ర. ప. పెగడపల్లి ఎస్ఎల్ మనోహర్, హాజరైనారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డి. తిరుపతి, అంగన్వాడి వర్కర్లు ఆశ వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News