- బడ వ్యాపారుల ఆక్రమణలకు అడ్డేది
- కబ్జాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
- బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో బడ వ్యాపారులు హవా కొనసాగుతుందని, బడ వ్యాపారుల అక్రమాలకు అడ్డే లేదని బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నచిన్న దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేద్దామనుకునే వారికి అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. మున్సిపల్ అధికారులు కాలువలు, ఖాళీ స్థలాలు మార్కెట్ ప్రాంతంలో కబ్జా అవుతున్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని, బడ వ్యాపారస్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తు, చిన్న చిన్న వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారని తెలిపారు. మందమర్రి టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కెట్ వెనకాల గల పేదల ఇళ్లను తొలగించి, ఎస్ కొండయ్య సూపర్ మార్కెట్ నుండి అజయ్ క్లాత్ స్టోర్ వరకు కాలువలు కబ్జాకు గురైన మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. బడ వ్యాపారులకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చుట్టాల అని ప్రశ్నించారు. కబ్జాకు గురైన కాలువలు, ఆక్రమణకు గురికావడానికి సిద్ధంగా ఉన్న ఖాళీ స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ, మున్సిపల్ అధికారులదే అని అన్నారు. కబ్జాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.





