- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
- రైతులకు సేవలు అందించటమే సహకార సంఘాల ద్యేయం
- ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ
నేటి సాక్షి, బెజ్జంకి : బెజ్జంకి మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు తన్నీరు శరత్ రావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సంఘ కార్యాలయం, బంకేట్ హల్,షాపింగ్ కాంప్లెక్స్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మానకొండూరు శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి ప్రారంభించారు. కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ మాట్లాడుతూ నాబార్డు కేంద్ర ప్రభుత్వ నిధులతో 3 కోట్లతో నిర్మించారని, గ్రామ పంచాయితీల కు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ నిధులతో నిర్మాణాల చేపడుతున్నారని, తాజమాజి సర్పంచ్లు లకు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని, గన్నేరువరం నుండి మానేరు వరకు బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని, నాయకుల మధ్య కొట్లాలు ఉండవని, ఎన్నికల్లో మాత్రమే విమర్శలు ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే దృష్టి అని, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని పార్టీ వాళ్ళు కలిసే ఉండి, ప్రజా సమస్యలపై ఒక అలోచన ఉంటుందని, అభివృద్ధి కూడా ఆ స్థాయిలో జరుగుతుందని, రైతులు తమ లోన్లు కడితే కొత్త వారికి అవకాశం దొరుకుతుందని, గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిలో ఈ ఏసీ ఫంక్షన్ హాల్ కట్టడం సంతోషకరమని, రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. అనంతరం మానకొండూరు శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుతుండదని, సహకార సంఘాలు రైతులకు సేవలు అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే సంక్షేమ పథకాల అమలులో రుణమాఫీ, రైతు భరోసా పథకాలను రైతులకు చేర్చటంలో సహకార బ్యాంకు లు ముందు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు,డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ పులి క్రిష్ణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి,మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి, కేడిసిసి డైరెక్టర్ అలువాల కోటి,మాజీ ఆప్కాబ్ ఛైర్మన్ దేవిశెట్టి శ్రీనివాస్ రావు, ప్యాక్స్ వైస్ చైర్మన్ బండి రమేష్, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జి ఎంపిడిఓ అంజయ్య, ప్యాక్స్ డైరెక్టర్ లు దీటి బాల నర్సు, అన్నాడి శ్రీనివాస్ రెడ్డి, బెజ్జంకి నరేష్ బాబు, కట్ట బాలవ్వ,కరివేద సరోజన, మచ్చ రాజేశం, సీత భూమయ్య, అన్నాడి రవీందర్ రెడ్డి, ఎలుకంటి తిరుపతి రెడ్డి, గూడెల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.





