Friday, March 13, 2026

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

  • హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య

నేటి సాక్షి , ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు): అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజా పాలన గ్రామ సభను నిర్వహించారు. ఈ సభా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. గ్రామ పంచాయతీ కార్యాలయం లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, రైతు భరోసా పథకాలకు సంబంధించిన ముసాయిదాను కలెక్టర్ సమక్షంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి చదివి వినిపించారు. ఆయా పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ముసాయిదా ను గ్రామ సభ ఆమోదం పొందిన తరువాత అర్హుల జాబితా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు అందుతాయన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములను గుర్తించిన తదుపరి వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందుతుందన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రభుత్వం అందిస్తుందన్నారు. నాలుగు ప్రభుత్వ పథకాల కోసం ముసాయిదాలో పేర్లు లేనట్లయితే గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డిస్క్ ల వద్ద దరఖాస్తు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంద న్నారు. ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ల వద్ద ప్రజలు పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిబ్బంది సహాయ పడాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రజల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా హార్టికల్చర్ అధికారి వెంకటేశ్వర్లు, డీఎల్పీవో గంగ భవాని, ఇంచార్జ్ ఎంపిడీవో కరుణాకర్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ రహీం పాషా, ఏపీవో విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News