Friday, March 13, 2026

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సమీక్ష

నేటి సాక్షి, రామగిరి(కన్నూరి రాజు): 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు సంబంధిత అధికారులతో మంగళవారం జీ. ఎం కార్యాలయము నందు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జనవరి 26న నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక రాణి రుద్రమ దేవి క్రీడా ప్రాంగణం నందు ఘనంగా నిర్వహించనునట్లు వారు తెలిపారు. మొదట జాతీయ జండా ఆవిష్కరణ, సెక్యూరిటీ సిబ్బంది, వివిధ పాఠశాల విద్యార్థులచే గౌరవ వందనం అనంతరం ఏరియా నుండి ఎంపికైన ఉత్తమ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమము అనంతరం పాఠశాల విధార్థిని విద్యార్థులచే సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు తెలిపారు. వేడుకలకు వచ్చే వారికి కావలసిన ఏర్పాట్లు చేయాలని ఏరియా అధికారులకు సూచించారు. అలాగే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతమయ్యేలా చూడాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎస్వొటుజియం జి. రఘుపతి, ఏరియా ఇంజినీర్ వై.వి. శేఖరబాబు, ఫైనాన్స్ ఏజీఎం పి. శ్రీనివాసులు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు జె. రాజశేఖర్, సి.హెచ్. వెంకట రమణ, ఐఈ డీజీయం కె. చంద్రశేఖర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ యం. రామ్మోహన్, పర్సనల్ విభాగాధిపతి బి. సుదర్శనం, అధికారులు పి. రాజారెడ్డి, డి. జనార్ధన రెడ్డి, బి.వి. సత్య నారాయణ, ఐలయ్య, కళ్యాణ్, రాజేంద్రప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News