Friday, March 13, 2026

అమ్మ ఫౌండేషన్ ఆపన్న హస్తం

నేటి సాక్షి, వీణవంక :
మృతుడి కుటుంబానికి బియ్యం అందజేసిన మృతుడి కుటుంబానికి బియ్యం అందజేసిన కరీంనగర్ జిల్ల వీణవంక మండలం శ్రీరాముల పేట గ్రామానికి చెందిన ఏరుకొండ సదయ్య సగర గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఇట్టి విషయాన్ని కరీంనగర్ జిల్లా సగర సంగం ప్రధాన కార్యదర్శి కట్ట రాజు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజుకు ఫోన్ ద్వారా తెలియజేయగా తక్షణమే స్పందించిన సమ్మన్న తమ ఫౌండేషన్ సభ్యులతో కలిసి మృతుడి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర, శ్రీరాములపేట గ్రామ అధ్యక్షుడు దేవునూరి రాజేందర్ సగర, మల్లారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, అమ్మ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, వీణవంక మండల ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు పల్లెర్ల కిరణ్ గుప్తా, సభ్యులు గంధం లక్ష్మణ్, వేణు, మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News