నేటి సాక్షి,మంథని(పెద్దపల్లి):
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో పెట్రోల్ స్కూటీ మోపెడ్ కు మంటలు అంటుకొని పాక్షికంగా దగ్ధం అయింది. 8 ఇంక్లైన్ కాలనీ నుంచి మంథనికి ఇద్దరు వృద్ధ దంపతులు వస్తుండగా స్కూటీ వెనుక భాగంలో కాయలు కాలిపోయి పోగలు వ్యాపించాయి. వారి వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారులు వెంటనే వారిని ఆపి ప్రమాదం నుండి తప్పించారు.స్కూటీ మంటలలో పాక్షికంగా కాలిపోయింది. స్థానిక హెచ్ పి పెట్రోల్ బంకు ఎదురుగా ఈ సంఘటన జరగడంతో వెంటనే అక్కడ ఉన్న ఉద్యోగులు మంటలను ఆర్పీ వేశారు. దారి మధ్యలో జరిగితే పెను ప్రమాదం సంభవించి ఉండేదని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.





