Saturday, March 14, 2026

ప్రజలకు పథకాలు అందించేందుకే గ్రామ సభలు

  • పథకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలి
  • జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి

నేటి సాక్షి, రామడుగు (పురాణం సంపత్): ప్రజలకు పథకాలు అందించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని జిల్లా పాలన అధికారి ప్రమేలా సత్పతి అన్నారు.ఈ సందర్భంగా రామడుగు మండలంలోని మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన సందర్శించారు.అనంతరం అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే అధికారులు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామసభలో ప్రకటించిన జాబితాలు ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చునని అన్నారు. ప్రజలు ఏ పథకం కోసం అయినా తెల్ల కాగితంపై దరఖాస్తు సమర్పించాలని అన్నారు. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు కూడా గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి,ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎంపీడీవో రాజేశ్వరి,అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News