Friday, March 13, 2026

న్యాయ వాదుల కబడ్డీ పోటీ … టీమ్ ‘ఏ’ విజయం

నేటిసాక్షి, కరీంనగర్:
రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని న్యాయవాదుల కబడ్డీ పోటీలను కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి వెంకటేష్ ప్రారంభించారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలోని కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఏ,బి,సి,డి టీమ్ లుగా ఏర్పడి పోటీలు జరుగగా ఫైనల్ లో డి టీమ్ పై ‘ఏ’ టీమ్ విజయం సాధించింది. ఏ టీమ్ లో జి మల్లేశం, బెజ్జంకి శ్రీకాంత్, రామాంజనేయులు, గుడిపాటి సత్యం రెడ్డి బి శ్రీకాంత్ , బలరాం నాయక్, ఎం రజినీకాంత్, కొత్త ప్రకాష్, లక్కం కిషోర్ చంద్ర ప్రకాష్ రెడ్డి, షేక్ మజీద్, సిహెచ్ సురేందర్, ఈ వి కృష్ణ కే ఏ భాస్కర్ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు పీవి రాజ్ కుమార్, బెతి మహేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. కబడ్డీ ఇన్చార్జి గా జి మల్లేశం వ్యవహరించారు. విజేతలను రిపబ్లిక్ డే రోజున జిల్లా జడ్జి బి ప్రతిమ బహుమతులను అందజేస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News