Friday, March 13, 2026

కాంగ్రెస్ కార్యకర్తలు సర్వేలో అధికారులతో కలిసి భాగస్వాములవ్వాలి

  • అర్హులైన లబ్దిదారులు ఆందోళన చెందవద్దు
  • ప్రతి ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు
  • వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలను కాంగ్రెస్ కార్యకర్తలు సర్వేలో అధికారులతో కలిసి విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇళ్ళు 4 పథకాలు అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా నేడు ఐనవోలు మండల పరిధిలోని పున్నెలు గ్రామ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొని అప్లికేషన్లు స్వీకరించారు. కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులతో కలిసి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నేటి నుంచి మొదలయ్యే గ్రామ సభలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోస, రైతు భరోస, నూతన రేషన్ కార్డుల పంపిణీ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరు లేని పథకాలకు అర్హులైన లబ్ధిదారులను దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. నేటి నుంచి నుంచి ఈ నెల 25 వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్న తరుణంలో సభలలో సైతం దరఖాస్తు చేసుకోవచ్చని లబ్ధిదారులకు సూచించారు. దీనిపై అర్హులు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సాగు భూములకే రైతు భరోసా ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతను ఇవ్వడం, భూమి లేకుండా ఉపాధి హామీ పని చేసుకునే నిరుపేదలకు ఆర్థిక భరోసా ఇవ్వడం, గత పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు నూతన రేషన్ కార్డులు ఇవ్వడం లాంటి పథకాలు ప్రవేశ పెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలకు రాజకీయాలకతీతంగా మద్దతు పలకాలని కోరారు. అలాగే మీకు ఏ సమస్య ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 8096107107 కి కాల్ చేసి మీ సమస్యను మాకు తెలియజేస్తే సత్వరమే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఏఓ, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ అధికారులు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అంగన్వాడి, ఆశ వర్కర్లు, మరియు మాజీ జడ్పీటీసీ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, మహిళ మండల అధ్యక్షురాలు ఇళ్ళందుల ఎలీషా, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్, మాజీ సర్పంచ్ కత్తి దేవేందర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇళ్లందుల సారయ్య, సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య, పోలేపల్లి బుచ్చిరెడ్డి, జున్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, బొమ్మెనేని రాకేష్ రెడ్డి మండల గ్రామ, స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News